నిప్పంటించి.. కళ్లలో కారం చల్లి..

12 Feb, 2016 03:53 IST|Sakshi
నిప్పంటించి.. కళ్లలో కారం చల్లి..

యాలాల: నిద్రిస్తున్న భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించడమే కాకుండా మంటలకు తాళలేక కేకలు పెడుతున్న అతడి కళ్లలో కారం చల్లి మరీ తన కర్కశాన్ని ప్రదర్శించిందో భార్య. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..

మహబూబ్‌నగర్ జిల్లా హస్నాబాద్‌కు చెందిన ఉద్దెరి రాములు(50) అక్కం పల్లికి చెందిన సావిత్రమ్మను వివాహమాడి ఇల్లరికం వచ్చాడు. వీరికి వెంకటయ్య, ఆంజనేయులు, విజయలక్ష్మి, రాధ, వెంకటలక్ష్మి సంతానం. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకు పొలం పని చేసి రాములు ఇంటికొచ్చాడు. అయితే, కుమారుడు ఆంజ నేయులు కనపడడంతో ఖాళీగా కూర్చొనే బదులు పశువులను పాకలో కట్టేయవచ్చు కదా అంటూ అతడిపై మండి పడ్డాడు.

దీంతో ఆగ్రహానికి గురైన సావిత్రమ్మ.. భర్తతో గొడవకు దిగింది. ఇరుగుపొరుగువారు కల్పిం చుకుని ఇద్దరినీ సముదాయించారు. రాత్రి ఏమీ తినకుం డానే ఇంటిముందు ఉన్న కట్టపై రాములు నిద్రకు ఉపక్రమించాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో కట్టపై నిద్రిస్తున్న రాములుపై భార్య  కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక కేకలు వేస్తున్న భర్త కళ్లలో కారం చల్లడంతో అటు మంటల బాధ, ఇటు కారం మంటతో రాములు ఇంటి బయట ఉన్న మురుగు కాల్వలోకి తలను దూర్చిస్పృహ కోల్పోయాడు. రాములు కేకలు విన్న ఇరుగుపొరుగు అతడిని ఆటోలో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలిం చారు. సావిత్రమ్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చిన్న కొడుకు ఆంజనేయులతో కలసి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది.
 
వాంగ్మూలం తీసుకున్న పోలీసులు
విషయం తెలిసిన వెంటనే రూరల్ సీఐ సైదిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీ, ఎస్‌ఐ అరుణ్‌కుమార్  తాండూరు ఆస్పత్రికి చేరుకుని రాములు నుంచి వాంగ్మూలం సేకరించారు. తన మృతికి సావిత్రే కారణమని రాములు పేర్కొన్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాములు తెల్లవారుజామున చనిపోయాడు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని యాలాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

>
మరిన్ని వార్తలు