అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగిందేమిటి: కావూరి

22 Dec, 2013 12:19 IST|Sakshi
అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగిందేమిటి: కావూరి
పశ్చిమ గోదావరి: రాష్ట్ర సమైక్యతకు అవసరమైనప్పుడే రాజీనామా చేస్తాను అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సమైక్యవాదినని నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎంపీల అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగిందేమి లేదు అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉండకూడదనే కారణంతోనే అవిశ్వాసంకు మద్దతు పలకలేదు కావూరి తెలిపారు. 
 
రాజకీయ నేతలు, అధికారులపై కావూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  రాజకీయ నాయకులు, అవినీతికి పాల్పడటం వల్లే కిందిస్థాయి ప్రజలకు అన్యాయం జరుగుతోంది అని కావూరి అన్నారు. ప్రభుత్వాలు నిధుల విడుదల చేస్తున్నా, నేతలు, అధికారులు అవినీతికి పాల్పడం వల్లే సంక్షేమం కుంటుపడుతోంది అని ఆయన విమర్శించారు. 
 
మరిన్ని వార్తలు