చోగమ్ ను బహిష్కరిద్దాం: తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

12 Nov, 2013 21:06 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో ఏర్పాటైన కామన్ వెల్త్ ప్రభుత్వాధినేతల (చోగమ్) సమావేశాలను భారత్ బహిష్కరించాలని తమిళ ప్రభుత్వం తీర్మానించింది. లంకలోని తమిళులపై అక్కడి ప్రభుత్వం వివక్ష చూపెడుతున్న నేపథ్యంలో భారత్ చోగమ్ కు దూరంగా ఉండి తన నిరసన తెలియజేయాలని తమిళనాడు అసెంబ్లీ ప్రతిపాదించింది. శ్రీలంకలో సింహాళీలతో పాటు తమిళులకు సమాన హక్కు కల్పించాలని తీర్మానించారు. అంతవరకూ శ్రీలంకలో జరిగే చోగమ్ సదస్సుకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ సమావేశాలకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నా, తన తరఫున విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తారని ప్రధాని మన్మోహన్ సింగ్ రాజపక్సేకు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

 

ఇదేమీ తమిళులకు ఊరటనిచ్చేది కాదని జయలలిత తెలిపారు. ఈ సదస్సును మొత్తంగా బహిష్కరిస్తేనే తమిళుల అండగా ఉన్నట్లని పేర్కొన్నారు. ఈ అంశంపై మెతక వైఖరి ప్రదర్శించుకుండా వెంటనే లంక ప్రభుత్వానికి తెలియజేయాలని జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం విజ్క్షప్తి చేసింది.  అసెంబ్లీ సమావేశానికి ముందు శ్రీలంకలో ప్రాణాలు కోల్పోయిన తమిళులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని వార్తలు