‘అగ్ని’ కేతనం

21 Jan, 2014 05:09 IST|Sakshi
‘అగ్ని’ కేతనం

అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. దీంతో సైన్యానికి అప్పగించేందుకు వీలుగా క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైందని డీఆర్‌డీవో ప్రకటించింది. సోమవారం ఉదయం ఒడిశా వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ లాంఛర్ నుంచి 10.52 నిమిషాలకు అగ్ని-4ను ప్రయోగించినట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఈ క్షిపణి ప్రయోగించిన 20 నిమిషాల్లో విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది.
 
 ప్రత్యేకతలు ఇవీ ...

  ప్రయోగించిన మూడు సార్లూ విజయవంతం
  అణ్వాయుధాలను మోసుకుపోగలిగే సామర్థ్యం
  4,000 కి.మీ.దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు
  850 కిలోమీటర్లు పైకి వెళ్లి, తిరిగి వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
  4,000 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది.
  లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు తోడ్పడే
 అత్యాధునిక మైక్రో నావిగేషన్ వ్యవస్థ
  మునుపటి అగ్ని సిరీస్‌లతో పోలిస్తే బరువు తక్కువ. రెండు దశల్లో ఘన ఇంధన వినియోగం.
     - బాలాసోర్ (ఒడిశా)

మరిన్ని వార్తలు