దేశంలోనే తొలి ద్విచక్ర అంబులెన్స్‌లు

9 Feb, 2016 06:30 IST|Sakshi
దేశంలోనే తొలి ద్విచక్ర అంబులెన్స్‌లు

చెన్నైలో ప్రారంభించిన సీఎం జయ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అంబులెన్స్ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులకు తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ద్విచక్ర వాహనాలతో అత్యవసర చికిత్సలు అందేలా మోటార్ సైకిల్, స్కూటర్ అంబులెన్స్‌లను సీఎం జయలలిత సోమవారం చెన్నైలో ప్రారంభించారు.  సాధారణ అంబులెన్స్‌లు ట్రాఫిక్ రద్దీని ఛేదించుకుని సంఘటన స్థలానికి వెళ్లడం కష్టసాధ్యం కావ డంతో ద్విచక్ర వాహనాల ద్వారా వేగంగా వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రూ.70 లక్షలతో 41 ద్విచక్ర వాహనఅంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

వీటిల్లో 31 మోటార్ సైకిల్, 10 స్కూటర్ అంబులెన్స్‌లు ఉన్నాయి.  వాహనం నడిపే వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేయగల శిక్షణ ఇచ్చారు. పది నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలానికి చేరుకునేలా వాటిని నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చెన్నైలో మాత్రమే ఈ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా