బలహీనపడుతున్న 'మాది' తుపాను

11 Dec, 2013 20:57 IST|Sakshi
బలహీనపడుతున్న 'మాది' తుపాను

విశాఖపట్నం: 'మాది' తుపాన్‌  క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన మాది తుపాను రేపటికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

 

దీని ప్రభావం వల్ల రాగల 48గంటల్లో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తుపాను ప్రభావంతో గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరంలో అలల ఉధృతి ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు