మరో బాలికపై సామూహిక అత్యాచారం

6 Aug, 2014 20:57 IST|Sakshi
మరో బాలికపై సామూహిక అత్యాచారం

మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పక్క  యువతిపై సామూహిక అత్యాచారం, ఇస్లాంమత మార్పిడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మరో పక్క మీరట్లోనే  మరో బాలికపై పొరుగున్న ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీరట్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి మహావీర్ సింగ్ కథన ప్రకారం కాంకర్ కేడా గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలిక ఆదివారం మార్కెట్కు వెళ్లింది. తన ఇంటికి సమీపంలో ఉండే ఇద్దరు యువకులు వశీం, ఇంద్రీష్లు  ఆ బాలికను తీసుకువెళ్లారు. జనసంచారం లేని ప్రదేశానికి ఎత్తుకువెళ్లి ఆ ఇద్దరూ బాలికపై అత్యాచారం చేశారు. అంతేకాకుండా తనను కొట్టినట్లు బాలిక తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ఊరుకునేదిలేదని  బెదిరించినట్లు  ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పృహలేని పరిస్థితులలో తనను రైల్వేట్రాక్ పడవేసినట్లు బాధితురాలు తెలిపింది.  ఫిర్యాదు ఆధారంగా బాధితురాలిని వైద్యచికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు