యురిదాడిపై ఎన్ఐఏ విచారణ

20 Sep, 2016 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ: యురిలో సైనిక స్థావరంపై ఉగ్రవాదదాడి ఘటనపై విచారణ చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ దాడి ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఎన్ఐఏ బృందం ఆధారాలు సేకరించడానికి త్వరలో యురికి వెళ్లనుంది. భద్రత దళాల కాల్పుల్లో హతమైన జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించనుంది.

జమ్ము కశ్మీర్లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. భద్రత దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్కు సంబంధముందని ఆధారాలు లభించాయి.

>
మరిన్ని వార్తలు