తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. లక్షల్లో నగదు, పలు డాక్యుమెంట్లు సీజ్‌

2 Oct, 2023 19:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో  కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ చేపట్టిన సోదాలు ముగిశాయి.  తెలుగు రాస్ట్రాల్లో ఏకకాలంలో 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఈరోజు(సోమవారం) సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 13 లక్షల నగదు, పిస్టల్‌తో సహా 14 రౌండ్ల బుల్లెట్ల స్వాధీనం చేసుకుంది ఎన్‌ఐఏ. దాంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్‌ చేసింది. ముంచుంగిపట్టు కేసులో భాగంగా సోదాలు నిర్వహించింది ఎన్‌ఐఏ. ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యుడు చంద్ర నర్సింహులు అరెస్ట్‌తో ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు జరిపింది ఎన్‌ఐఏ.

సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో తనిఖీలు చేపట్టింది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే టార్గెట్‌గా ఈ సోదాలు నిర్వహించారు,.

గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజావైద్యకళాశాలలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. డాక్టర్‌ టీ రాజారావు పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరులో ఏపీ సీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్‌ రాజారావు ఇళ్లతో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. విజయవాడలో విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ ఇంట్లో సోదాలు చేపట్టింది.

రాజమండ్రి బొమ్మెరులో పౌరహక్కుల నేత, అడ్వకేట్‌ నాజర్‌, శ్రీకాకుళం కేఎన్‌పీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇంట్లో తనిఖీలు చేపట్టింది. నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉంటున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతోంది. ఎల్లంకి వెంకటేశ్వర్లు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు.  అనంతపురం బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. సలకంచెరువు పాఠశాలలో శ్రీరాములు హిందీ పండిట్‌గా  పనిచేస్తున్నారు. తీవ్రవాదులతో సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు..

కుల నిర్మూలన పోరాట సమిత నేత దుడ్డు వెంకట్రావు, సంతమాగలూరు సంతమాగులూరులో శ్రీనివాసరావు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఎన్‌ఆర్‌ఎఫ్‌ ప్రతిప్రతినిధి, మంగళగిరి మండలం నవులూరులోని మక్కేవారిపేట,  గన్నవరంలో అమ్మిసెట్టి రాధా, తాడేపల్లి బత్తుల రమణయ్య ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు  సోదాలు జరుపుతోంది. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో కుల  నిర్మూలనా పోరాట సమితి నేతగా వ్యవహరిస్తున్న కోనాల లాజర్ ఇంట్లో సోదాలు చేస్తోంది.

హైదరాబాద్‌లోనూ సోదాలు
హైదరాబాద్‌లోనూ సోదాలు నిర్వహించింది ఎన్‌ఐఏ. విద్యానగర్‌లోని పౌర హక్కుల సంఘం నేత సురేష్‌, బంధుమిత్రుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది.

మరిన్ని వార్తలు