నిరుపమారావుకు అరుదైన గౌరవం

2 Jun, 2017 15:20 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన నిరుపమారావు(66)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఉడ్రో విల్సన్‌ సెంటర్‌కు రీసెర్చ్‌ ఫెలోగా ఆమె ఎంపికయ్యారు. 3 నెలల పాటు కొనసాగనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా నిరుపమారావు చైనా–భారత్‌ సంబంధాలపై అధ్యయనం చేయనున్నారు. జూన్‌ నుంచి మొదలు కానున్న ఈ ప్రాజెక్టులో ఇరుదేశాల మధ్య సంబంధాలతో పాటు ఆసియా పురోగతిలో భారత్‌ పాత్రపై కూడా చర్చిస్తామని ఉడ్రో విల్సన్‌ సెంటర్‌ ప్రతినిధి తెలిపారు.

2009–11 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా నిరుపమారావు పనిచేశారు. చైనాకు నియమితులైన తొలి భారత మహిళా రాయబారిగా చరిత్ర సృష్టించారు. అమెరికా 28వ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ స్మృత్యర్థం 1968లో కాంగ్రెస్‌ ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇక్కడ పరిశోధకులు అధ్యయనం చేస్తారు.

మరిన్ని వార్తలు