-

జీపీఎఫ్‌ చందాదారులకు చల్లని కబురు

13 Apr, 2017 09:24 IST|Sakshi
జీపీఎఫ్‌ చందాదారులకు చల్లని కబురు

న్యూఢిల్లీ: జీపీఎఫ్‌ (సాధారణ భవిష్య నిధి) చందారులకు కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. జీపీఎఫ్‌ నుంచి అడ్వాన్స్‌ తీసుకోవాలన్నా, పూర్తిగా విత్‌డ్రా చేసుకోవాలన్నా ఎటువంటి పత్రాలనూ సాక్ష్యాలుగా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జితేంత్ర సింగ్‌ బుధవారం లోక్‌సభలో చెప్పారు. దరఖాస్తుతోపాటు చందాదారు నుంచి డిక్లరేషన్‌ ఉంటే చాలన్నారు.

2017 మార్చి 7 నుంచి జీపీఎఫ్‌ నుంచి విద్య, అనారోగ్యం, ఏవైనా వస్తువులు కొనుక్కోవడం తదితర ఖర్చుల కోసం అడ్వాన్స్‌ తీసుకోవడం లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవడం కోసం పాటించాల్సిన విధానాలను ప్రభుత్వం సరళీకరించిందని మంత్రి చెప్పారు. జీపీఎఫ్‌ నుంచి అడ్వాన్స్‌, విత్‌డ్రా పూర్తిగా చేసుకుంటే నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరపాలన్న నిబంధన పెట్టినట్టు వెల్లడించారు. జీపీఎఫ్‌ వడ్డీ రేటును ఈపీఎఫ్‌తో సమానంగా పెంచే యోచనేదీ లేదని జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు