10 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు

11 Jul, 2015 11:40 IST|Sakshi
10 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు

చెన్నై: గ్యాస్ సబ్సిడీ రద్దు చేసుకోవాలంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి అన్యూహ్య స్పందన లభిస్తుంది. దేశ్యవాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్సిడీని రద్దు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 2.09 లక్షల మంది వినియోగదారులు ఈ సబ్సిడీని రద్దు చేసుకుని.. ఆ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని మహారాష్ట్ర కైవసం చేసుకుంది.

కోటి మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్బిడీని రద్దు చేసుకునే లక్ష్యంగా గ్యాస్ కంపెనీలు ఇప్పటికే మీడియా సాధనాల ద్వారా ప్రచార ఉద్ధృతిని పెంచాయి. దేశంలోని గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటంబానికి హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ గ్యాస్,  ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీలు రాయితీపై ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున... వినియోగదారుడికి అందజేస్తుంది.

అయితే ఒక్కో సిలిండర్కు రూ. 207 అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దాంతో ఏటా రూ. 40 వేల కోట్లు భారం ప్రభుత్వంపై పడుతుంది. గ్యాస్కు ఇచ్చే సబ్సిడీ రాయితీ వదులుకుని... మరో పేద కుటుంబానికి ఆ అవకాశం కల్పించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు