నలుగురు రేపిస్టులకు ఉరిశిక్ష

21 Apr, 2015 09:30 IST|Sakshi
నలుగురు రేపిస్టులకు ఉరిశిక్ష

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో నలుగురు అత్యాచార నిందితులకు కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేసేందుకు రంగం సిద్దమైంది.  మంగళవారం ఇద్దరు నిందితులు సలీమ్, నౌమన్లకు సియల్ కోట్ జిల్లా జైలులో అధికారులు ఉరిశిక్షను అములు చేయనున్నారు. అలాగే మరో ఇద్దరు నిందుతులు అబిద్ మసూద్, సన్హుల్లాలకు బుధవారం ఉరి వేయనున్నారు. 1999లో మైనర్పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితులు సలీం, నౌమన్లకు కోర్టు ఉరి శిక్ష విధించింది.

1997లో 15 ఏళ్ల బాలికపై అబిద్, నన్హుల్లాలు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో వీరికి కోర్టు మరణశిక్ష విధించింది. అయితే గతేడాది డిసెంబర్లో పెషావర్లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 150 మంది మరణించారు. దీంతో పాక్ ప్రభుత్వం దేశంలో ఉరిశిక్షపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వివిధ నేరాల చేసి జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలను ఇప్పటికే ఉరి వేసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు