బాలయ్యకు హీరోయిన్ దొరికింది

20 Sep, 2013 12:31 IST|Sakshi
బాలయ్యకు హీరోయిన్ దొరికింది

యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమాకు ఎట్టకేలకు హీరోయిన్ దొరికింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రానికి ప్రధాన నాయకిగా రాధికా ఆప్టేను ఎంపిక చేశారు. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం చివరకు ఆమె పేరును ఖరారు చేశారు. ఇందులో మరో కథానాయకిగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. 'మా చిత్రంలో బాలకృష్ణ సరసన రాధిక, సోనాల్  హీరోయిన్లుగా నటిస్తారు' అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందించిన 'సింహా' ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో రెండోది. ఈ సినిమా టైటిల్ను ఇంకా నిర్ణాయించాల్సివుంది. మరో హీరో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

>
మరిన్ని వార్తలు