తెలుగు సాహిత్య నిధి రావూరి

12 Oct, 2013 01:23 IST|Sakshi
తెలుగు సాహిత్య నిధి రావూరి

సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంస
భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ:
నవలా రచరుుత, సాహితీవేత్త రావూరి భరద్వాజ తెలుగు సాహిత్యానికి నిధివంటి వారని ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంసించారు. సాహిత్యం, సంగీతం సముద్రం లాంటివని, రావూరివంటి గొప్ప సాహితీ వేత్తకు అవార్డు అందజేయడం తనకు ఎంతో గర్వకారణవుని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో తీన్‌మూర్తి భవన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రవుంలో రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డును అంజద్ అలీఖాన్ అందజేశారు. అస్వస్థులైన భర ద్వాజ అతికష్టంమీద చక్రాల కుర్చీలో.. అవార్డు ప్రదానానికి హాజరయ్యారు. భారతీయ సాహిత్యంలో రావూరి ప్రస్థానం ఎంతో గొప్పదని వక్తలు ఈ సందర్భంగా కీర్తించారు.
 
తమాషాకు అంటున్నారనుకున్నా..
అనారోగ్యం కారణంగా రావూరి భరద్వాజ మాట్లాడలేకపోవడంతో ఆయన ప్రసంగ పాఠాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయుం హిందీ విభాగం అధిపతి శేషారత్నం చదివి వినిపించారు.‘మనం కేవలం ఇతరులకు ఆదర్శాల గురించి చెప్పడమే కాదు. వాటిని పాటించాలి. జీవితంలో నేను పూర్తిగా అనుసరించాను. అదే నమ్మకంతో జీవితంలో కొద్దికొద్దిగా ఎదిగాను. పేద కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులులేని నేను ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూనే  జీవితంలో ముందుకెళుతూ వచ్చాను. ఈ రోజు మీ అందరి ముందు కూర్చోగలిగాను. నాకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందని ఎవరో ఫోన్‌లో చెబితే నమ్మలేదు. తమాషాకోసం చెబుతున్నారనుకున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో పురస్కారాలు ఎలా వస్తున్నాయో అందరికీ తెలుసు. నా రచనలు ఎవరు ఇంత దూరం పంపుతారు. ఎవరికి నా రచనల గురించి తెలుస్తుందనుకున్నా. కానీ ఎలాంటి సిఫారసు చేయకుండానే, నా రచనలకు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంది. దీంతో నా జీవితం ధన్యమైంది. జ్ఞానపీఠ్ అవార్డు సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రచనలను సమీక్షచేసి మీ ముందుంచిన పట్నాల.సుధాకర్‌కి సైతం నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.’ అని భరధ్వాజ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు. పలువురు సాహిత్య అభివూనులతో పాటు రావూరి కుటుంబ సభ్యులు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!