జియో మరో బంపర్‌ ఆపర్‌

23 Mar, 2017 15:05 IST|Sakshi
జియో మరో బంపర్‌ ఆపర్‌

న్యూఢిల్లీ:  సంచలనానికి మారుపేరుగా నిలిచిన రిలయన్స్  జియో  ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచిత డేటా ఉచిత వాయిస్  కాలింగ్ సదుపాయాలనుంచి టారిఫ్  లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో  ఇపుడు  ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఉచితంగా అందించే  ప్లాన్ ను ఒక దాన్ని  తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఆఫర్లో  రూ.99 ల చార్జితో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా  మార్చి 2018 వరకు జియో సేవలు ఉచితం. అయితే  జియో మనీ ద్వారా  ప్రత్యేక ఆఫర్లో ఉచితంగా ప్రైమ్ మెంబర్ షిప్  పొందే  అవకాశాన్ని కల్పించింది.

ఎలా అంటే..
15 మార్చి నుండి ప్రారంభమైన ఈ  ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది. జియోమనీ వాలెట్ లేదా మై జియో యాప్  లేదా  www.jio.com  లాగిన్  ద్వారా  రూ.99+303  చెల్లించాలి. అనంతరం యాప్‌ లోరూ.50 డిస్కౌంట్  వోచర్‌  లభిస్తుంది. ఈ వోచర్‌ రూ.303లు,  ఆ పైన విలువగల తరువాతి రీచార్జ్‌ సమయంలో వినియోగించుకోవచ్చు. 25 మార్చి నుంచి జూన్‌ 30 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ పరిమిత కాలంలో ఇలా యూజర్‌ 5 సార్లు మాత్రమే  ట్రాన్సాక్షన్‌ చేసుకోవడానికి వీలవుతుంది.   సో.. ఇలా రెండుసార్లు రీచార్జ్‌   చేసుకొని, రెండు సార్లు  50  క్యాష్ బ్యాక్‌ ఆఫర్‌ పొందడం ద్వారా ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ను ఉచితంగా  పొందవచ్చన్నమాట.

కాగా 303 రూపాయల ప్లాన్లో  ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 499 రూపాయల ప్లాన్ లో  28 రోజుల వ్యాలిడిటీతో 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 999 రూపాయల  రీచార్జ్‌పై ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ,  1999 రూపాయల ప్లాన్లో  ప్రైమ్ మెంబర్స్‌కు 125 జిబి 90 రోజుల వ్యాలిడిటీ,  నాన్ ప్రైమ్ యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ 30 జీబీ ఆఫర్‌  సంగతి తెలిసిందే.

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా