80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

4 Nov, 2023 20:13 IST|Sakshi

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన మరో ఐదేళ్లు పొడిగింపు ఛత్తీస్‌గడ్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీ హామీ

కాంగ్రెస్‌  ప్రజలను లూటీ చేస్తోంది, చివరికి ‘మహదేవ్‌’ ని కూడా వదిలిపెట్టడం లేదు

 ప్రతీపైసా వసూలు చేస్తాం, వారిని జైలుకు పంపుతామంటూ రాష్ట్ర సర్కార్‌పై ధ్వజం

కేంద్ర ప్రభుత్వం  మరోసారి శుభవార్త అందించింది. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగించేందుకు బీజేపీ నేతృత్వంలోని రేంద్ర మోదీ  సర్కార్‌ నిర్ణయించింది.  తాజా నిర్ణయంతో  ప్రభుత్వ అధికారుల అంచన ప్రకారం దాదాపు రూ. 2 లక్షల కోట్ల వ్యయం  కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు.  తద్వారా 80 కోట్లమంది మరో ఐదేళ్లపాటు లబ్ధి పొందుతారని, అన్ని వర్గాలకు ఉచిత బియ్యం అందుతాయని ప్రధాని మోదీ వెల్లడించారు.

మరోవైపు  మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ద్వారా ‘అక్రమ డబ్బు'ను ఉపయోగిస్తోందంటూ కాంగ్రెస్‌పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు.  ప్రజల్ని దోచుకొనే  ఏ   అవకాశాన్నీ కాంగ్రెస్‌ వదిలిపెట్టదు.  చివరికి ఆన్‌లైన్‌బెట్టింగ్‌  యాప్‌ ‘మహదేవ్‌’ ను  కూడా వదల్లేదంటూ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌ ప్రభుత్వంపై ప్రధాని విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిందితులందరిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం.. ప్రతి పైసా వారి నుంచి తీసుకుంటాం వారి జైలుకు పంపిస్తామన్నారు.  కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. (షాకింగ్‌ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి)

కాగా 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలోపేద ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PMGKAY)ను  పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్దిదారులందరికీ, నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలను అందిస్తోంది. దీన్ని జూలై 2013లో తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ (ఆహార భద్రత స్కీమ్)  NFSAతో విలీనం చేసింది. ఈ పథకానికి అయ్యే ఖర్చును రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే అందిస్తోంది. దీని ద్వారా  81.35 కోట్ల మందికి  ఉచిత రేషన్‌ అందుతోంది.  (కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్‌  మైండ్‌ కోసం వేట)

ఇటీవల, ఆహార మంత్రి, పీయూష్ గోయల్, PMGKAY కింద, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఫేజ్ I నుండి ఫేజ్ VII వరకు మొత్తం) దాదాపు 1,118 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించిందని పార్లమెంటుకు తెలియజేశారు. దీనికి సంబంధించి  మొత్తం మంజూరైన బడ్జెట్ దాదాపు రూ. 3.91 లక్షల కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌‌లో అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్న సంగతి  తెలిసిందే.  రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న, రెండో విడతలో మిగతా 70 స్థానాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది. (డేంజర్‌ బెల్స్‌ : టెక్‌ కంపెనీల కీలక చర్యలు)

మరిన్ని వార్తలు