పడిలేచిన రూపాయి...

2 Aug, 2013 01:39 IST|Sakshi

 ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) చర్యల ఊతంతో గురువారం ట్రేడింగ్‌లో రూపాయి మారకం కనిష్ట స్థాయిల నుంచి ముప్పావు శాతం మేర కోలుకుంది. చివరికి డాలర్‌తో పోలిస్తే కొంత నామమాత్రంగా 3 పైసల నష్టంతో 60.43 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 60.25 కన్నా తక్కువగా 60.40 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత 60.25-60.90 శ్రేణి మధ్య తిరుగాడింది. అటుపైన పీఎస్‌యూ బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో చివరికి 3 పైసల నష్టంతో 60.43 వద్ద ముగిసింది. ముగింపు సమయంలో రూపాయి విలువ ముప్పావు శాతం పెరగడానికి ఆర్‌బీఐ జోక్యమే కారణమై ఉంటుంద ని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ చెప్పారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు ప్రకటించడం కూడా దేశీ కరెన్సీ బలోపేతానికి తోడ్పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పుడిప్పుడే బాండ్ల కొనుగోలును ఉపసంహరిస్తామని ఇథమిత్థంగా సంకేతాలేమీ ఇవ్వకపోవడం, స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు అంచనాల కన్నా మెరుగ్గా ఉండటం వంటి కారణాలతో అటు విదేశాల్లో డాలరు బలపడింది.
 

మరిన్ని వార్తలు