అత్యవసరంగా దిగిన సింగపూర్ విమానం

5 May, 2015 19:49 IST|Sakshi
అత్యవసరంగా దిగిన సింగపూర్ విమానం

కోల్ కతా: సింగపూర్ ఎయిర్ ఫోర్స్ విమానం మంగళవారం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దిగింది. 15 మందితో వెళుతున్న ఈ విమానం ఇంధన లీకేజీ కారణంగా కిందకు దిగినట్టు అధికారులు వెల్లడించారు. కఠ్మాండు నుంచి సింగపూర్ వెళుతున్న ఈ విమానంలో 6 నిమిషాలకు మాత్రమే సరిపడా ఇంధనం ఉండడంతో అత్యవసరంగా కిందకు దించారు.

మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ఇంధన లీకేజీ గుర్తించిన పైలట్ కిందకు దిగేందుకు కోల్ కతా ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అనుమతి కోరాడని వెల్లడించారు. లోపాన్ని సరిచేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు విమానం మళ్లీ పైకి ఎగిరింది.

>
మరిన్ని వార్తలు