‘నల్ల’ పేరు వెల్లడించిన స్విస్

9 Sep, 2015 08:28 IST|Sakshi
‘నల్ల’ పేరు వెల్లడించిన స్విస్

బెర్నే: విదేశాల్లో దాచిన నల్లధనంపై భారత అధికారులు కొనసాగిస్తున్న వేటకు సహకరిస్తున్న స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒక కొత్త పేరును వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన టెక్స్‌టైల్ సంస్థ నియో కార్ప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేరును అనుమానిత కంపెనీగా తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. భారత అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ సంస్థకు చెందిన సమాచారాన్ని అందజేసినట్టు అందులో పేర్కొంది. నియో కార్ప్ సంస్థకు అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు.

1985లో చిన్న గోనె సంచుల తయారీ  పరిశ్రమగా వ్యాపారాన్ని ప్రారంభించిన నియోకార్ప్.. ఇప్పుడు మల్టీనేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ గ్రూపుగా చెప్పుకుంటోంది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఫిబ్రవరిలో ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఈ సంస్థ స్థలాల్లో తనిఖీలు చేశారు.
 

మరిన్ని వార్తలు