కృష్ణా జలాలపై విచారణ సెప్టెంబర్‌కు వాయిదా

8 Jul, 2017 03:38 IST|Sakshi
కృష్ణా జలాలపై విచారణ సెప్టెంబర్‌కు వాయిదా

- రెండు రాష్ట్రాల ప్రతిపాదిత అంశాలపై ముగిసిన వాదనలు
- విచారణాంశాలపై ఆగస్టు 16న పత్రాలు సమర్పించాలన్న ట్రిబ్యునల్‌


సాక్షి, న్యూఢిల్లీ:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాలపై జరుగుతున్న విచారణను జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సెప్టెంబర్‌ 13, 14, 15 తేదీలకు వాయిదా వేసింది.

ఆగస్టు 16లోపు ఈ కేసు విచారణకు సంబంధించి విచారణాంశాలపై అదనపు పత్రాలను ఇరు రాష్ట్రాలు సమర్పిం చాలని ఆదేశించింది. కృష్ణా జలాల పంపిణీలో ఏయే అంశాలను విచారించాలన్న దానిపై ఏపీ, తెలంగాణ సమర్పించిన ముసాయి దాలను ట్రిబ్యునల్‌ పరిగణనలోకి తీసుకుంది. ఏపీ 11, తెలంగాణ 16 అంశాలను ప్రతిపా దించాయి. ఏపీ ప్రతిపాదించిన అంశాల్లో ఒకదాన్ని తిరస్కరించిన ట్రిబ్యునల్, తెలంగా ణ సూచించిన అంశాలను పలు సవరణలతో విచారణకు అమోదించింది. వీటిపై సెప్టెంబర్‌ 13 నుంచి వాదనలు వింటామని పేర్కొంది.

ఏపీపై ఆగ్రహం..
విభజన చట్టంలోని షెడ్యూల్‌ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ కోర డంపై గురువారం విచారణ సందర్భంగా ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయిం పులను ఎలా కోరతారని ప్రశ్నించింది. శుక్రవా రం విచారణలో కూడా ఏపీ ఈ అంశాన్ని లేవ నెత్తింది. దీనిపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు సెక్షన్‌– 89తో సంబంధం లేదని వాదించారు. కాగా విభజన చట్టం రూపకల్పనలో దురదృష్టవశా త్తు తప్పులు దొర్లాయని గంగూలీ అన్నారు. సెక్షన్‌–89లోనే ఈ ప్రాజెక్టుల పేర్లను కూడా పొందుపరిచి ఉండాల్సిందని అభిప్రాయప డ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ మిగులు జలాల ఆధా రిత ప్రాజెక్టులని వైద్యనాథన్‌ పేర్కొన్నారు. మిగులు జలాలు ఉంటే అంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ప్రకాశం బ్యారేజీ నుంచి వినియో గించుకోవాలి.. కానీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవాలని ఏపీ యత్నిస్తోందని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్‌ కల్పించుకొని ఇరు రాష్ట్రాలకు నీటి కేటా యింపుల సమయంలో మిగుల జలాలు ఉంటే షెడ్యూల్‌ 11లోని ప్రాజెక్టులకు కేటాయింపు లపై అప్పుడు ఆలోచిద్దామని అభిప్రా యపడింది. ఇక కృష్ణా నదీ జలాల యాజ మాన్య బోర్డు 2015లో నీటి నిర్వహణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపులను చట్టబద్ధం చేయాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. అనంతరం ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన విచారణాంశాలపై ఆగస్టు 16వ తేదీలోపు అదనపు పత్రాలను సమర్పిం చాలని ఇరు రాష్ట్రాలను ట్రిబ్యునల్‌ ఆదేశించింది.

మరిన్ని వార్తలు