నేటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు

22 Jul, 2015 00:35 IST|Sakshi

తవుకు ఏ కోర్సులు అక్కర్లేదని లేఖలు ఇచ్చిన 16 కాలేజీలు
60 కాలేజీల్లో రెండు, వుూడు బ్రాంచీలకు తనిఖీలు వద్దని లేఖలు

 
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో బుధవారం(22వ తేదీ) నుంచి తనిఖీలు చేపట్టాలని జేఎన్‌టీయుూహెచ్ నిర్ణరుుంచింది. ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన దాదాపు 25 బృందాలు ఈ తనిఖీలను చేపట్టనున్నారుు. ప్రతి కళాశాలను ముగ్గురు సభ్యుల బృందం తనిఖీ చేయనుంది. ఈ బృందంలో ఏఐసీటీఈకి చెందిన ఇద్దరు ప్రతినిధులు, జేఎన్‌టీయూహెచ్‌కు చెందిన ఒక ప్రతినిధి ఉంటారు. అఫిలియేషన్లు కోరుతూ, సీట్ల కోతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో ఈ తనిఖీలు చేయనున్నారు. ప్రతి కాలేజీకి తనిఖీలకు వెళ్లే తేదీ వివరాలను 48 గంటల ముందుగానే తెలియజేసిమరీ ఈ బృందాలు తనిఖీలకు వెళ్లనున్నారుు. బుధవారం తనిఖీలు చేసే కాలేజీలకు ఇప్పటికే విషయాన్ని తెలియజేశాయి. కోర్టును ఆశ్రరుుంచిన 121 కాలేజీల్లో 60 కాలేజీలు రెండు, వుూడు కోర్సులకు తనిఖీలు వద్దని, ఒకటీ రెండు బ్రాంచీలకే తనిఖీలు చేయూలని కోరుతూ లేఖలను జేఎన్‌టీయుూహెచ్‌కు అందజేశారుు.

అదనపు బ్రాంచీలు, అదనపు సీట్ల కోసం చూసుకొనిసంయుక్త తనిఖీలకు ఒప్పుకుంటే.. జేఎన్‌టీయూహెచ్ మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చిన బ్రాంచీలు, సీట్లు కూడా లేకుండాపోయే ప్రవూదం ఉందన్న ఆందోళనతో కాలేజీలు ఈ నిర్ణయూనికి వచ్చారుు. వురో 16 కాలేజీలు తవుకు ఏ కోర్సులు వద్దని, తవు కాలేజీల్లో తనిఖీలు చేయూల్సిన అవసరం లేదని పేర్కొంటూ లేఖలను అందజేశారుు. దీంతో కొన్ని కోర్సులకే తనిఖీలు కావాలన్న కాలేజీలతోపాటు అసలు లేఖలే ఇవ్వని వురో 46 కాలేజీల్లో సంయుుక్త బృందాలు తనిఖీలు చేపట్టనున్నారుు. 28వ తేది నాటికి తనిఖీలను పూర్తి చేసి తనిఖీ నివేదికలను హైకోర్టుకు అందజేయునున్నారుు..
 
 

మరిన్ని వార్తలు