మహిళలు లేరని ఐక్యరాజ్య సమితిలో గొడవ

14 Oct, 2015 09:49 IST|Sakshi

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి మహిళల ఉన్నత విభాగంలో  విమర్శల గొడవలు మొదలయ్యాయి. దాదాపు పదిహేనేళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ శాంతి గురించి ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టే బృహత్తర కార్యక్రమానికి ఆ విభాగం నుంచి కనీస సంఖ్యలో కూడా మహిళలు పాలుపంచుకోవడంపట్ల ఐక్యరాజ్యసమితి ఇతర ఉన్నత విభాగ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళా విభాగాన్ని తీవ్రంగా విమర్శించారు.

ప్రపంచశాంతి నిర్మాణంలో భాగంగా ఒక తీర్మానం తీసుకురావాలని అందులో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించడంతోపాటు, ఆ తీర్మానంలో మహిళలకు సంబంధించి పలు అంశాలు చేర్చినా వాటిని పట్టించుకోకుండా వారు హాజరుకాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని కలిగించిందని అన్నారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ తీర్మానం విషయంలో మంగళవారం ప్రత్యేక భేటీ నిర్వహించామని, ఈ సమావేశానికి తక్కువ సంఖ్యలో హాజరయ్యారని, కొన్ని దేశాలకు ప్రాతినిథ్యం వహించే మహిళలు పాల్గొనకపోవడం కొంత విస్మయాన్ని కలిగించిందని భద్రతా మండలి సభ్యురాలు హుమిజిల్ లాంబో యంగ్కుఖా అన్నారు.

మరిన్ని వార్తలు