ఆ పోలీసులు నగరానికి మంచిది కాదు

27 May, 2015 20:37 IST|Sakshi
ఆ పోలీసులు నగరానికి మంచిది కాదు

న్యూఢిల్లీ: అసంతృప్తితో ఉండే పోలీసు అధికారులు నగరానికి అంత మంచిదికాదని అతడి అవసరాలన్నీతీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఢిల్లీ హైకోర్టు సూచించింది. తన పరిశీలనలోకి వచ్చిన ప్రకారం నీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి కొన్ని ప్రత్యేకమైన అవసరాలను పోలీసు అధికారులు ఉంటున్న నివాసాలకు తప్పనిసరిగా కల్పించే ఏర్పాట్లు చేయాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీడబ్ల్యూడీ)కి ఆదేశించింది.

ఢిల్లీలోని పలు పోలీసుల భవనాలను పరిశీలించేందుకై ఏర్పడిన లాయర్ల ప్యానెల్ నివేదిక ఇచ్చిన అనంతరం పలు పోలీసు అపార్ట్ మెంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. వెంటనే వారికి ఆ సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇవ్వాలని చెప్పింది. అసంతృప్తితో ఉండే పోలీసులు విధుల విషయంలో ఏకాగ్రతతో పనిచేయాలేరని, వారిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

మరిన్ని వార్తలు