ఆ విమానం కూలిపోయింది

26 May, 2017 13:26 IST|Sakshi
ఆ విమానం కూలిపోయింది

గువాహటి: నాలుగు రోజుల క్రితమైన అదృశ్యమైన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 యుద్ధ విమానం కూలిపోయినట్టు గుర్తించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని దండకారణ్యంలో విమాన శకలాలను కనుగొన్నట్టు వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడికి చేరుకోవడం ఆలస్యమవుతుందని వెల్లడించింది. విమానంలోని ఇద్దరు పైలట్లు చనిపోయివుంటారని భావిస్తున్నారు.

చైనా సరిహద్దు సమీపంలో గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. దీని ఆచూకీ కనిపెట్టేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రెండు ఐఏఎఫ్‌, ఐదు సైనిక బృందాలతో పాటు రెండు రాష్ట్రాల సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఎలెక్ట్రో పెలోడ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌(ఏఎల్‌హెచ్‌) ప్రత్యేక హెలికాప్టర్‌ సహాయంతో గాలించారు. తేజ్‌పూర్‌కు ఉత్తర దిక్కులో 60 కిలో మీటర్ల దూరంలో చివరిసారిగా దీని జాడలు రికార్డయ్యాయి. అననుకూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయినట్టు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు