హోరా హోరీగా కేఎల్ఏపీ వాలీబాల్ గేమ్స్

19 Oct, 2016 18:07 IST|Sakshi
హోరా హోరీగా కేఎల్ఏపీ వాలీబాల్ గేమ్స్

మేరీల్యాండ్:
కేఎల్ఏపీ(కేరళ-ఏపీ) వాలీబాల్ టోర్నమెంట్2016 పోటీలు మేరీల్యాండ్లో రసవత్తరంగా జరిగాయి. ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద ఆల్ ఇండియన్ టోర్నమెంట్గా నిర్వహించిన ఈ పోటీల్లో 30 జట్లు, 280 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి వాలీబాల్ పోటీలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ టోర్నమెంట్ను బాల్టిమోర్లోని యూఎమ్బీసీ క్యాంపస్లో నిర్వహించారు.  తంపా ఎఫ్ఎల్, న్యూ జెర్సీ, న్యూయార్క్, చికాగో, మేరీల్యాండ్, విరినియా, కెనెడా టోరొంటో, వాంకోవర్, విండ్సర్ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లు కేఎల్ఏపీ 5వ సీజన్లో పాల్గొన్నారు. మొత్తం రెండు విభాగాల్లో పోటీలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లలో మొదటి విభాగంలో కేరళన్యూస్లైవ్.కామ్ ఛాంపియన్గా నిలువగా, రెండో విభాగంలో  ఐరన్ క్లా విజేతగా నిలిచింది.

టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేఎల్ఏపీ వ్యవస్థాపక సభ్యులు విజోయ్ పట్టమాడి, వెంకటరెడ్డి యెర్రమ్, జాన్సన్ కడమ్కులతిల్, రామా రావు తుల్లూరిలు మాట్లాడుతూ.. యూఎస్ఏలోని తమ కమ్యూనిటీ, ఆటలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని తెలిపారు. మేరీల్యాండ్లోని కొందరు వాలీబాల్ ఆటగాళ్లు కలిసి కేఎల్ఏపీ ఆర్గనైజేషన్ను 2012లో స్థాపించారు. వీళ్లు ఆంధ్రప్రదేశ్(తెలంగాణ కలుపుకుని), కేరళలకు చెందినవారవ్వడంతో రెండు రాష్ట్రాల పేర్లతో కలిపి ఆర్గనైజేషన్ పేరు వచ్చేలా పెట్టారు.


కేఎల్ఏపీ కమిటీ సభ్యులు రాజ్ కురుప్, మోహన్ మవుంగల్, జోస్ థామస్, బిజొ విత్యాతిల్, జాన్నీ, జోయ్, జీజో, గుర్రం వెంకట్, శ్రీనాథ్, కిషోర్, కే యలమంచిలి శ్రీనివాస్ రావు, ప్రదీప్, మాథ్యూ, వాసు పుట్ట, సంతోష్, సమినేని, కుకట్ల శ్రీనివాస్లతో పాటూ బాబీ, చంద్ర గిడుతురి, సుధీర్ చంద్రగిరీ, ఢీకొండ శ్రీనివాస్, సామినేని శ్రీనివాస్, హృతిక్(పండు), వెంకట్ పుచ్చకాయల హర్ష, రాజు లింగంపల్లి, శ్రీనాథ్ కంద్రు, అనిల్ సుదం అల్ల, ఫణి జలువంచ, రామ్ సువర్ణకంటి, సన్యాసిరావు, అరుణ్ ఫెర్నాండేజ్(ఏజే), కిషోర్ కొర్రపాటి, నవీన్ పేర్నేని(నాగ), సంతోష్, అనురాగ్, సురేష్ కుప్పిరెడ్డిలు టోర్నమెంట్ నిర్వహణలో తమ వంతు కృషి చేశారు.

విల్డేలేక్ ఇంటర్ఫెయిత్ సెంటర్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నిర్వాహకులు విజేతలకు ట్రోపీలను అందించారు. విజేతలతోపాటూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులను ప్రదానం చేశారు.

మొదటి విభాగం విజేతలు:
తొలిస్థానం: కేరళన్యూస్లైవ్.కామ్
రన్నరప్: విండర్స్ స్పోర్ట్స్ క్లబ్
మూడో స్థానం: న్యూజెర్సీ బాద్షాజ్, ఐకోర్ కాన్వెస్ట్

రెండో విభాగం విజేతలు:
తొలిస్థానం: ఐరన్ క్లా
రన్నరప్: బాల్టిమోర్ కోబ్రాస్-బీ
మూడో స్థానం: పీఎస్సీ రాకర్స్, ఓవింగ్స్ ల్యోన్స్








మరిన్ని వార్తలు