మురుగు.. ముప్పు

12 Feb, 2018 16:17 IST|Sakshi
దేవాలయ సమీపంలో మురికి కూపంగా..

లోపించిన పారిశుద్ధ్యం

రోడ్లపైనే మురుగు

పట్టించుకోని అధికారులు,  ప్రజాప్రతినిధులు

వీపనగండ్ల : మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. వీధుల్లోని రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. పందులు, దోమలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
  
ముక్కు మూసుకోవాల్సిందే.. 
గ్రామాల్లోని అంతర్గత రోడ్లపై నడవాలంటే ముక్కు మూసుకెళ్లాల్సిందే. రోడ్లపైనే మురుగు, వ్యర్థపదార్థాలు పడేస్తుండటంతో పందులు సంచరిస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు .. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా చేసుకున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
  
పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా  
మండలంలో పారిశుద్ధ్యం, అంతర్గత , ఆపరేటర్ల నిర్వాహణ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేశారు. సంపట్రావుపల్లిలో పారిశుద్ధ్యం, ఆపరేటర్‌ పేరుతో రూ.లక్షా 10వేలు డ్రా చేసినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు.  సంగినేనిపల్లిలో పారిశుధ్యం నిర్వాహణ కోసం రూ.60 వేలు, ఆపరేటర్‌ వేతనం కోసం రూ.8824 , తూంకుంటలో రూ.75 వేలు, గోవర్దనగిరిలో రూ.35 వేలు, కల్వరాళ్లలో రూ.40వేలు ఖర్చు చే సినట్లు అధికారులు లెక్కలు  వేసి ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి డ బ్బులు డ్రా చేశారు. కానీ చాలా గ్రామా ల్లో పారిశుధ్య పనులు చేపట్టిన దాఖ లాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు.

విచారణ జరపాలి 
గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రా చేసిన నిధులపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి. గ్రామాల్లో ఉన్న మురికి గుంతలను పూడ్చి వృథా నీరు ఊర చివరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి ఆందోళనకు శ్రీకారం చుడుతాం. 
– శేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు

దృష్టి సారిస్తాం 
గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తాం.  ప్రజా ప్రతినిధులు డ్రా చేసిన నిధులపై విచారణ జరుపుతాం. గ్రామాల్లో పర్యటించి శాశ్వత పారిశుద్ధ్య నిర్వాహణ పనుల కోసం నిధుల మంజూరుకు జిల్లా అధికారులకు నివేదికలు పంపుతాం. 
– బద్రినాథ్, ఇన్‌చార్జ్‌ ఈఓఆర్‌డీ

మరిన్ని వార్తలు