మళ్లీ త్రీఆర్స్‌

12 Feb, 2018 16:25 IST|Sakshi
పొన్కల్‌ పాఠశాలలో త్రీఆర్స్‌ అంశాలను చదువుతున్న విద్యార్థులు 

మార్చి వరకు నిర్వహించాలని ఆదేశం 

పరీక్షల సమయంలో అమలయ్యేనా? 

జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 112
ప్రాథమికోన్నత పాఠశాలలు : 92
ప్రాథమిక పాఠశాలలు : 527
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు : 66,759
కసూర్తిబా పాఠశాలలు : 18 
విద్యార్థినులు : 2,889 


మామడ(నిర్మల్‌) : విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం భాషల్లో అనర్గళంగా చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు, రాత అంశాలను నేర్పించాలని ఈ విద్యాసంవత్సం జూలై, ఆగస్టులలో 2017లో త్రీఆర్స్‌(రీడింగ్, రైటింగ్, రీజనింగ్‌) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక, ఉన్నత, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని 60రోజుల పాటు నిర్వహించారు. విద్యార్థులు అన్ని అంశాల్లో కొంతవరకు ప్రగతి సాధించినప్పటికీ మరింత ప్రగతిని కనబర్చాల్సి ఉందని భావించారు. ఈ నెల 15నుంచి మార్చి చివరి వారం వరకు త్రీఆర్స్‌ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


అమలు ఇలా.. 


విద్యార్థులను జట్లుగా చేసి చివరి మూడు పీరియడ్‌లలో తెలుగు, ఆం గ్లం, గణితం ఒక్కో సబ్బెక్ట్‌కు ఒక్కో పీరియడ్‌ కేటాయించారు. ప్రా థమిక పాఠశాలలో తెలుగులో సరళ పదాలు నేర్పించారు. గుణింతాలు, ఆంగ్ల పదాల వద్ద, గణితంలో తీసివేతలను విద్యార్థులకు మ రింత సులభతరంగా బోధించాలని మానిటరింగ్‌ బృందం సూచించింది. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం లో వాక్యాలు.. గణితంలో గుణాకారాలు, భాగహారాలను మళ్లీ నేర్పించాలని సూచించారు. ప్రతీ పది రోజులకోసారి తెలుగు, గణితం, ఆం గ్లం విషయాలలో సాధించాల్సిన లక్ష్యాలను పట్టిక రూపొందించుకోవాలని సూచించారు. త్రీఆర్స్‌ నిర్వహణను 60రోజులు పూర్తయినా ల క్ష్యం నెరవేరలేదని మళ్లీ అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. 


ఉన్నత పాఠశాలల్లో చేయాల్సినవి..  


ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను గ్రూపుల వారీగా విభజించి ఏ స్థాయిలో ఉన్నారో చూడాలి. తెలుగు ఆంగ్ల భా షల్లో పేరాలు చదివి అర్థం చేసుకోవడం, సొంతంగా రాయడం, గణితంలో గుణకారం, భాగహారాలతో కూడిన రాత లెక్కలను చేయగలిగే లా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. మార్చి రెండో వా రంలోగా విద్యార్థులకు త్రీఆర్స్‌ను పూర్తి స్థాయిలో సాధించాల్సి ఉం టుంది. ప్రతీ పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిది వరకు పిల్లలంతా త్రీఆర్స్‌ చేయగలరని పాఠశాలల వారీగా ధ్రువీకరించాల్సి ఉంటుందని సూచించారు. 


ప్రాథమిక పాఠశాలల్లో.. 


ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు మార్చి చివరి వరకు త్రీఆర్స్‌ను పూర్తి చేయాలి. తెలుగులో ఎంతమంది విద్యార్థులు సరళ పదాలు, గుణింత పదాలు, ఒత్తు పదాలు, వాక్యాలు చదవడం రాయడం చేయగలరో గుర్తించాలి. గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, రాత లెక్కలు చేయగలరో గుర్తించాలి. ఆంగ్లంలో అక్షరాలు, పదాలు, వాక్యాలు, చదవడం, రాయడం చేయగలరో గుర్తించాలి. ఏ సబ్జెక్ట్‌లోనైన 80శాతం మంది విద్యార్థులు చేయగలిగితే మరో అంశాన్ని ప్రారంభించాలి. మార్చి చివరి వారంలో అంత్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. 


మానిటరింగ్‌ బృందం సందర్శన.. 


జనవరి 3నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర బృందం పాఠశాలలను సందర్శించింది. జిల్లాలోని 12 ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల రాష్ట్ర సగటు హాజరు 83శాతం కాగా, జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు 75 శాతం ఉంది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం రాష్ట్ర సగటు 84శాతం కాగా, జిల్లాలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయు ల హాజరు శాతం 87శాతం ఉందని మానిటరింగ్‌ బృందం నిర్ధారించింది. జిల్లాలోని మామడ మండలంలోని కొరిటికల్‌ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో త్రీఆర్స్‌ బాగా అమలైనట్లు అధికారులు ప్రశంసించారు.


అమలు సాధ్యమయ్యేనా?  


మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలున్నాయి. పరీక్షలకు ఇన్విజిలేటర్‌లుగా ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. వీరు ఇన్విజిలేటర్‌లుగా వెళ్తే త్రీఆర్స్‌ను విద్యార్థులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఉన్నత పాఠశాలల్లో త్రీఆర్స్‌ను ముగించిన ఉపాధ్యాయులు ప్రస్తుతం సిలబస్‌పై దృష్టి పెట్టారు. త్రీఆర్స్‌పై దృష్టి పెట్టాలంటే సిలబస్‌ పూర్తి చేయడం కష్టంగా మారుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. 


ఆదేశాలు జారీ అయ్యాయి 


పాఠశాలల్లో ఇప్పటికే త్రీఆర్స్‌ అంశాలను అమలు చేశారు. మానిటరింగ్‌Š  బృందాల పరిశీలనలో పూర్తిస్థాయిలో ప్రాథమిక అంశాలు అమలు కాలేదని త్రీ ఆర్స్‌ను నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫి బ్రవరి 15నుంచి మార్చి వరకు ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు. 
వెంకటరమణారెడ్డి, సెక్టోరల్‌ అధికారి, నిర్మల్‌  


పరీక్షలపుడు సాధ్యం కాదు 


పరీక్షల సమయంలో త్రీఆర్స్‌ను నిర్వహించడం సా« ద్యం కాదు. అధికారులు గుర్తించి రెండో విడతలో అ మలు చేయనున్న త్రీఆర్స్‌ను విరమించుకోవాలి. ప దో తరగతి పరీక్షలుండడంతో పాటు విద్యాసంవత్స రం ముగుస్తున్నందున సిలబస్‌పై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తారు. వీటిని అధిగమించి త్రీఆర్స్‌ను నిర్వహించడం సాధ్యం కాదు. 
తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి   

మరిన్ని వార్తలు