వివాహం కావడంలేదని.. యువకుడు మనస్తాపంతో ఇలా..

19 Nov, 2023 09:57 IST|Sakshi
రాంచందర్‌ (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: వివాహం కావడంలేదని మనస్తాపంతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోషం రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కడ్తాల్‌ గ్రామానికి చెందిన పందిరి లింగన్న, పోశాని దంపతుల కుమారుడు రాంచందర్‌ (32)పెళ్లి సంబంధాలు కుదరడంలేదని కొంతకాలంగా మనస్తాపం చెందుతున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో బయటకు వెళ్లి గ్రామ శివారులోని వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు