జీ స్క్వేర్ హౌసింగ్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంఎస్‌ ధోనీ

23 Nov, 2022 19:30 IST|Sakshi

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ ‘జీ స్క్వేర్ హౌసింగ్’.. క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనితో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ధోనితో భాగస్వామ్యం ద్వారా దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కోయంబత్తూరు లాంటి నగరాల్లో  తమ డైనమిక్, ప్రగతిశీల వృద్ధి వ్యూహాన్ని పునరుద్ఘాటిస్తుందని కంపెనీ తెలిపింది. 

రియల్ ఎస్టేట్‌లో తమ నైపుణ్యాన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రణాళికల్లో ఉంది కంపెనీ. పదేళ్ల అనుభవంతో, జీ స్క్వేర్ హౌసింగ్ టీమ్ రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో, భారీ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిందనీ, తద్వారా కస్టమర్ల మనసు దోచుకుందని తెలిపింది.

ప్రస్తుతం  6000 కంటే ఎక్కువ కస్టమర్ బేస్‌తో 60కి పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు  తమ చేతిలో ఉన్నాయని, ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని వెల్లడించింది. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలోని తమ వినియోగదారులకు 1000 ఎకరాలకు పైగా భూమిని విక్రయించిన జీ స్క్వేర్ హౌసింగ్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌లను అందిస్తోందని కంపెనీ సీఈవో ఈశ్వర్ ఎన్ తెలిపారు.

ఎంఎస్‌ ధోని లాంటి దిగ్గజం, గొప్ప బ్యాట్స్‌మెన్, గొప్ప టీం లీడర్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు సీఈవో ఈశ్వర్.  దేశీయ పాపులర్‌ ప్లాట్‌ ప్రమోటర్‌గా మరిన్ని భౌగోళిక ప్రాంతాల్లో తమ జీ స్క్వేర్ హౌసింగ్ బ్రాండ్‌ మరింత బలోపేతం కావడానికి ఇది సాయం చేస్తుందన్నారు. (అడ్వటోరియల్‌)

మరిన్ని వార్తలు