ఈత పోటీల్లో మైత్రేయికి అంతర్జాతీయ ఖ్యాతి

10 Mar, 2023 01:18 IST|Sakshi
పతకం సాధించిన ఎన్నిటి మైత్రేయి

కొమ్మాది (భీమిలి): అంతర్జాతీయ ఈత పోటీల్లో జీవీఎంసీ 8వ వార్డు ఎండాడకు చెందిన 5 ఏళ్ల బాలిక ఎన్నిటి మైత్రేయి పతకాలు సాఽధించింది. బ్యాంకాక్‌లో ఈ నెల 2 వ తేదీ నుంచి జరిగిన ఏషియన్‌ ఓపెన్‌ స్కూల్స్‌ ఇన్విటేషనల్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ –2023 పేరుతో నిర్వహించిన ఈత పోటీల్లో మైత్రేయి పాల్గొంది. 48 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. భారత దేశం నుంచి80 మంది ఎంపికయ్యారు. ఏపీ నుంచి నలుగురు ఎంపిక కాగా..అందులో మైత్రేయి ఒకరు. గ్రూప్‌–8 విభాగంలో పోటీ పడిన మైత్రేయి ఏడు రజిత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించింది. ఆల్‌ రౌండ్‌ విభాగంలో ఆసియాలో ద్వితీయ స్థానంలో నిలిచించి. అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనపరిచిన బాలిక తండ్రి ఐఆర్‌ఎస్‌ అధికారి భాస్కరరావు, తల్లి మంగమ్మ జిల్లా అటవీ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు