నాడు-నేడు పనుల వేగం పెంచండి : ఆదిమూలపు సురేష్

4 Nov, 2020 20:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : నాడు-నేడు పనుల్లో జాప్యం సహించేది లేదని, గడువులోగా నూరుశాతం పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో నాడు-నేడు పనుల ప్రగతిపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పనులకు అవసరమైన సామగ్రి సకాలంలో సరాఫరా చేయని కంపెనీలకు నోటీసులు ఇవ్వాలన్నారు.

అవసరమైతే వాటి అగ్రిమెంట్‌లు పరిశీలించాలని అధికారులకు సూచించారు. సివిల్‌ పనులు దాదాపు పూర్తికాగా, వాష్‌బేసిన్‌లు, మరుగుదొడ్ల సామాగ్రి, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయడంలో జాప్యం జరగుతుందని తెలిపారు. వర్షాల కారణంగా కొన్నిచోట్ల పెయింటింగ్‌ పనులు నిలిచిపోయాయని చెప్పారు. మరో పదిరోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు. వంద శాతం సామగ్రి పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి సురేష్‌  ఆదేశించారు. 

మరిన్ని వార్తలు