దంచికొట్టిన వాన

23 Mar, 2023 01:16 IST|Sakshi

అనకాపల్లిలో జోరుగా కురుస్తున్న వర్షం

తుమ్మపాల : అనకాపల్లి పట్టణం, మండలంలో బుధవారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. దాదాపు మూడు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. రోడ్లపై తిరిగే వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కాలువలు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వర్షం పడటం శుభసూచికంగా చెప్తున్నప్పటికీ, ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన టమాటాతో పాటు పలు పైర్లు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వర్షాల నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షం కురవడంతో పంట నష్టం మరింతగా పెరుగుతుందని వాపోతున్నారు. బుధవారం మధ్యాహ్నం అనకాపల్లిలో అత్యధికంగా 44.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీవో జి.రామారావు తెలిపారు. బుచ్చెయ్యపేట, పరవాడ, నర్సీపట్నం, మాడుగుల, సబ్బవరం, మాకవరపాలెం, రావికమతం మండలాల్లో అక్కడక్కడ 20.0 మి.మీ. నుంచి 27.5 మిల్లీమీటర్ల వరకు వర్షం పాతం నమోదైందన్నారు.

మరిన్ని వార్తలు