జన సంద్రమైన చంద్రగిరి

2 Oct, 2023 04:28 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమ్మేళనానికి 25 వేల మంది హాజరు

చెవిరెడ్డిపై నాయకుల ప్రశంసల జల్లు

తిరుపతి రూరల్‌: వైఎస్సార్‌సీపీ శ్రేణులతో చంద్రగిరి జన సంద్రమైంది. ఆత్మీయ సమ్మేళనం జన ఉప్పెనను తలపించింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయ­కత్వంలో తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రూరల్‌ మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్సార్‌­సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దాదాపు 25 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి ఉప ముఖ్యమంత్రి నారాయణ­స్వామి, మంత్రి ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్‌ భూ­మన కరుణాకరరెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథు­న్‌రెడ్డి, రెడ్డెప్ప, డాక్టర్‌ గురుమూర్తి, ఎమ్మె­ల్సీ సి­పాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే జయ­దేవనాయుడు పాల్గొన్నారు.

వైఎస్సార్సీ­పీకి చంద్రగిరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చా­రని, నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ, అంకిత­భా­వంతో చెవిరెడ్డి రాజకీయాల్లో ఉన్నత శిఖరా­లను అధిరోహించారని పలువురు కొని­యాడా­రు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మె­ల్యేగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఆదరించాలని నాయకు­లంతా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మె­ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడు­తూ.. సీఎంవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో పార్టీలకు అతీతంగా నియోజక­వర్గంలో అభివృద్ధి పనులను చేపట్టినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు