గ్యాస్‌ టర్బైన్‌ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తి

16 Dec, 2023 06:22 IST|Sakshi
జీటీసీ బ్లేడ్స్‌ నమూనాని పరిశీలిస్తున్న వైస్‌ అడ్మిరల్‌ నత్వానీ, డీఆర్డీవో డీజీ డా.శ్రీనివాసరావు  

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భారత నౌకాదళం మరో ముందడుగు

సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భారత నౌకాదళం ముఖ్య భూమిక పోషిస్తోంది. గ్యాస్‌ టర్బైన్‌ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తిని సాధించింది. విశాఖలోని ఇండియన్‌ నేవీ నేవల్‌ బేస్‌ ఐఎన్‌ఎస్‌ ఏకశిలలో ఈ సాంకేతికత అభివృద్ధి జరిగింది.

గ్యాస్‌ టర్బైన్‌ కంప్రెసర్‌ బ్లేడ్ల తయారీ ఇకపై మేడ్‌ ఇన్‌ ఇండియాగా రానున్నట్లు ఇండియన్‌ నేవీ చీఫ్‌ మెటీరియల్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సందీప్‌ నత్వానీ తెలిపారు. డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ డా.వై శ్రీనివాసరావుతో కలిసి సందీప్‌ నత్వానీ ఐఎన్‌ఎస్‌ ఏకశిలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా  జీటీసీ బ్లేడ్ల తయారీకి సంబంధించిన డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఇకపై ఇతర ప్రాంతాలకు జీటీసీ బ్లేడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతులు రాబోతున్నాయని వైస్‌ అడ్మిరల్‌ నత్వానీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు