‘వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌’ అమలు సమీక్షకు మంత్రుల కమిటీ

24 Sep, 2021 10:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: పేదల గృహ రుణాలకు సంబంధించిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం అమలును సమీక్షించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం(రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ వారానికి ఒకసారి ఈ పథకంపై సమీక్షించాల్సి ఉంటుంది. అలాగే అవసరమైన చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి.  
 

మరిన్ని వార్తలు