యూజీసీ సాయం కొనసాగేలా చూడాలి

17 Aug, 2021 09:01 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిడెడ్‌ కాలేజీల యాజమాన్యాల విజ్ఞప్తి

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ఎయిడెడ్‌ కళాశాలల్లోని శాశ్వత సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో యూజీసీ నుంచి వచ్చే ఆర్థిక, సాంకేతిక ఇతర సహకారాలను యథావిధిగా కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ప్రైవేట్‌ యూజీ అండ్‌ పీజీ ఎయిడెడ్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ సంఘం రాష్ట్ర సమావేశం విజయవాడ కేబీఎన్‌ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.లక్ష్మణరావు, తూనుకుంట్ల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, అయితే శాశ్వత సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా.. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం యథావిధిగా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు