భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ.. 

24 Sep, 2020 12:52 IST|Sakshi

నెల రోజులపాటు స్పందన ఫిర్యాదులపై అధ్యయనం

మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం

రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘ చర్చ

సాక్షి, అమరావతి: రెవెన్యూ భూముల సంస్కరణల మంత్రి వర్గ ఉప సంఘం భేటీ గురువారం జరిగింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ సమస్యలు తగ్గించేలా అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలన,సూచనలు చేయడమే లక్ష్యంగా చర్చ సాగింది. (చదవండి: పరిటాల సునీత ఫ్యామిలీ భూబాగోతం!)

22ఏ కింద ఉన్న భూములపై అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎస్టేట్, ఇనాం భూములపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూములను అతి తక్కువగా నామినల్ రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు నెల రోజులపాటు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు