రేపటి నుంచి సొంత జిల్లాల్లో సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

8 Nov, 2023 20:28 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 09, 10వ తేదీల్లో ఆయన అక్కడికి వెళ్లనున్నారు.  

గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఆపై మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలోనూ పాల్గొంటారు. అటు నుంచి సొంత నియోజకవర్గం పులివెందుల(వైఎస్‌ఆర్‌ జిల్లా)లో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. పులివెందులలోనే శిల్పారామంను ప్రారంభిస్తారు. ఆపై శ్రీస్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 

ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రిక్లచర్‌, హార్టికల్చర్‌ కాలేజీలు స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్‌ హార్టికల్చర్‌ ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. ఆపై ఆదిత్య బిర్లా యూనిట్‌ను సీఎం జగన్‌ సందర్శిస్తారు. అనంతరం సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. ఆ రాత్రికి ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌజ్‌లో బస చేస్తారు. 

ఇక 10వ తేదీ ఇడుపులపాయలో ఆర్‌కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. అనంతరం ఎకో పార్క్‌ వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. 

మరిన్ని వార్తలు