వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో సీఎం జగన్‌ భేటీ.. కుప్పం నుంచే షురూ

3 Aug, 2022 16:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పార్టీ కోసం, ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగష్టు 4వ తేదీ నుంచి ప్రతీ నియోజకవర్గ కార్యకర్తలతో తానే భేటీ నిర్వహిస్తానని గతంలో ప్రకటించారు కూడా.

ఇచ్చిన మాట ప్రకారం.. గురువారం(ఆగష్టు 4) తేదీ నుంచి కార్యకర్తలతో సీఎం జగన్‌ నేరుగా భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. తొలుత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ సాగనుంది. మధ్యాహ్నాం సమయంలో ఈ భేటీ జరగనుంది.

ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు.. పురోగతి, బలోపేతం, అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి. అదే సమయంలో ప్రత్యర్థుల నోళ్లను ఎలా మూయించాలి.. తదితర విషయాలపై సీఎం జగన్‌ నేరుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు