స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు

6 Aug, 2020 21:13 IST|Sakshi

విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

వేడుకల నిర్వహణపై సమీక్ష చేపట్టిన సీఎస్ నీలం సాహ్ని

కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం

సాక్షి, అమరావతి : ఈనెల(ఆగష్టు) 15న రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆమె సంబంధిత శాఖల అధికారులతో జూమ్ యాప్ ద్వారా వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
(చదవండి : కొత్త వర్సిటీల ఏర్పాటుకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌)

ముఖ్యంగా కరోనా నేపథ్యంలో దాని నివారణకు వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకున్నవిప్లవాత్మక చర్యలను ఈవేడుకల ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రత్యేక దృష్టిపెట్టి ఈవేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ నీలం సాహ్ని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. (చదవండి : స్థానిక సంస్థ‌ల పాల‌న‌పై కీల‌క నిర్ణ‌యం)

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహనను పెంపొందించేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సంబంధిత శాఖల ద్వారా చేపట్టిన పధకాలపై ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. దీనిపై సాధారణ పరిపాలన,వైద్య ఆరోగ్యం,సమాచారశాఖ, కృష్ణా జిల్లా కలక్టర్, పోలీస్ కమీషనర్లు కూర్చిని చర్చించుకుని ఒక ప్రణాళికతో వస్తే వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో ఈవేడుకలను ఘనంగా నిరవహించేందుకు చర్యలు తీసుకుందామని సీఎస్‌ నీలం సాహ్నిచెప్పారు. ఈ జూమ్ వీడియో సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కమీషనర్ కె భాస్కర్, విజయవాడ పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాస్,సీపీడీసీఎల్‌ సీఎండీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు