‘సోనూ సూద్‌ పీఎస్‌4 కావాలి ప్లీజ్‌’

6 Aug, 2020 20:59 IST|Sakshi

సాయం కావాలి అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు నటుడు సోనూ సూద్‌. వలస కార్మికులు మొదలు ఇళ్లు లేని వితంతవు వరకు ఎందరినో ఆదుకున్నారు ఈ రియల్‌ హీరో. సోనూ సూద్‌ దాతృత్వం గురించి తెలియడంతో కష్టాల్లో ఉన్నవారు ఆయనను ఆశ్రయిస్తున్నారు. ఆపదలో ఉన్న వారే కాక కొందరు వెరైటీ కోరికలు కూడా కోరుతుంటారు. అయితే వారికి తగిన సమాధానం ఇస్తుంటారు సోనూ సూద్‌. తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి ఎదురయ్యింది. ట్విట్టర్‌ యూజర్‌ ఒకరు పీఎస్‌4(ప్లే స్టేషన్‌)  ఇప్పించాల్సిందిగా సోనూ సూద్‌ని కోరాడు. అందుకు ఈ రియల్‌ హీరో ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. (మెడికోలకు సోనూసూద్‌ బాసట..)

వివరాలు.. ఓ వ్యక్తి ట్విట్టర్‌లో ‘సోనూ సూద్‌ సార్‌ ప్లీజ్‌.. నాకొక పీఎస్‌4 ఇప్పించగలరా.. లాక్‌డౌన్‌లో నా చుట్టూ ఉన్న పిల్లలంతా పీఎస్‌4లో గేమ్స్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్లీజ్‌ నాకు ఒకటి ఇప్పించి హెల్ప్‌ చేయండి సార్’‌ అని ట్వీట్‌ చేశాడు. ఇందుకు సోనూ సూద్‌.. ‘నీ దగ్గర పీఎస్‌4 లేనందుకు నీవు చాలా అదృష్టవంతుడివి. దాని బదులు బుక్స్‌ తెచ్చుకుని చదువుకో. నీ కోసం ఈ సాయం చేయగలను’ అంటూ రీట్వీట్‌ చేశారు సోనూ సూద్‌. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. 
 

లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ల ఊర్లకు చేర్చారు సోనూసూద్‌. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ప్రాంతం, భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారికి  అండగా నిలిచారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ తరువాత ప్రసారం అవుతున్న ‘ది కపిల్‌ శర్మ’ షోకు సోనూసూద్‌ గెస్ట్‌గా వస్తున్నారు. అయితే ఈ షోలో సోనూ సూద్‌ వల్ల సాయం పొందిన చాలా మంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన సోనూసూద్‌ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. (భావోద్వేగం, సోనూ సూద్‌ కంటతడి!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా