రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు

27 Jul, 2020 17:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ రోజు(సోమవారం) నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

వచ్చే నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి 19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేసినట్టు  చెప్పారు.

మరిన్ని వార్తలు