ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్‌ 

9 Jan, 2021 16:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్‌ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు.. సోమవారం విచారించనుంది. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి ఏకపక్షంగా షెడ్యూల్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: మళ్లీ ఏకపక్ష నిర్ణయం)

ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ‘నిమ్మగడ్డ.. చంద్రబాబు తొత్తు’)

మరిన్ని వార్తలు