లోకల్‌ ఐటీకి బూస్టింగ్‌

6 Jul, 2021 04:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) సంస్థలను పెద్దఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు స్థానిక ఐటీ సంస్థల నుంచే సంబంధిత సేవలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఏపీ ఇండస్ట్రియల్‌ పాలసీ 2020–23 కింద స్థానిక ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేసేవిధంగా పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగంలోనూ స్థానిక సంస్థలను పెద్దఎత్తున ప్రోత్సహించే విధంగా కీలక చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూని కేషన్స్‌ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 

ఇక లోకల్‌ ఐటీ రంగం నుంచే కొనుగోళ్లు ..
ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు రూ.కోటిలోపు విలువైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఐటీ సర్వీసులను స్థా నిక ఐటీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విధంగా ఐటీ పాలసీ 2021–24లో నిబంధన విధించారు. ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు కలిపి ఐటీ సేవలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల విలువైన కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బయట రాష్ట్రాల నుంచే ఉంటుండ టంతో స్థానిక ఐటీ కంపెనీలను ప్రోత్సహించే విధంగా పలు ప్రతిపాదనలు చేశారు. కంపెనీలు రాష్ట్రంలో నమోదై కనీసం 50 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే నిబంధన విధించింది. అంతేకాదు రూ.కోటి విలువ దాటిన టెండర్ల ఖరారు సమయంలో సాంకేతిక మదింపు సమయం లో స్థానిక ఐటీ కంపెనీలకు 5 శాతం అదనపు ప్రా ధాన్యత కల్పించాలి. ఇందుకోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ప్రత్యేక పోర్టల్‌ను అందుబా టులోకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో నమోదు చేసుకోవడం ద్వారా ఇక్కడే నుంచే సర్వీసులు అందిస్తాయని.. తద్వారా పెద్దఎత్తున ఐటీ కంపెనీలను ఆకర్షించవచ్చని సీఐఐ ఏపీ చాప్టర్‌ మాజీ చైర్మన్, ఎఫ్‌ట్రానిక్స్‌ సీఈవో దాసరి రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.

డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత
ప్రభుత్వ విభాగాల్లో వినియోగించే ఐటీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ నాణ్యత, భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా డేటా సెంటర్‌ ఏ ర్పాటు చేయడంతో పాటు ఐటీ ఉత్పత్తులు, సేవల విషయంలో కేంద్రీకృత వ్యవస్థను ఏ ర్పాటు చేస్తోంది. ఇకనుంచి ప్రభుత్వ విభాగా లు కొనుగోళ్లకు సంబంధించి ఏపీటీఎస్‌ను అధీకృత ఏజెన్సీగా  ఐటీ శాఖ నియమించిం ది. రూ.10 లక్షలు దాటి కొనుగోలు చేసే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్కింగ్‌ ప్రోడక్ట్స్, ఐటీ సేవలను ఇకపై ఏపీటీఎస్‌ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.10 లక్షల లోపు కొనుగోలు చేసే వాటికి రేట్‌ కాంట్రాక్ట్‌ను ఏపీటీఎస్‌ నిర్దేశిస్తుంది. ఐటీ భద్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వం ఏకీకృత నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో త్వరోలోనే ఐటీ శాఖ వీటికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది.  

మరిన్ని వార్తలు