ఏపీ: పంటల బీమా కోసం రూ.2,586.60 కోట్లు విడుదల

13 May, 2021 10:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతులకు బీమా సొమ్ము చెల్లించేందుకు రూ.2,586.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని రియల్‌ టైం గవర్నెన్స్‌ ద్వారా ఈ నెల 25న ఆధార్‌తో లింక్‌ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ మేరకు అర్హుల జాబితాలు సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చెయ్యాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.

చదవండి: ఏపీ: రూ.1,200 కోట్లతో 30 నైపుణ్య కళాశాలలు 
వ్యాక్సిన్‌ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే 

మరిన్ని వార్తలు