AP: మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి 

12 Feb, 2024 06:09 IST|Sakshi

జపాన్‌ సకురా సైన్స్‌ ఫెయిర్‌కు ఏపీ విద్యార్థులు 

ప్రభుత్వ పాఠశాలల నుంచి ఏడుగురు ఎంపిక 

ఇన్‌స్పైర్‌ పోటీల్లో ఇప్పటికే ముందంజ గతేడాది యూఎన్‌ఓకు వెళ్లిన 10 మంది విద్యార్థుల బృందం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో సత్ఫలితాలు 

నాడు–నేడుతో మారిన ప్రభుత్వ బడులు, పెరిగిన వసతులే కారణమంటున్న విద్యావేత్తలు 

జిల్లా స్థాయిలో ప్రారంభమైన ఇన్‌స్పైర్‌ పోటీలు  

సాక్షి, అమరావతి : సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూ­పిస్తు­న్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థా­యిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చా­టు­తు­న్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పా­ఠ­శా­లలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అ­వ­స­రమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్ర­భు­త్వం క­ల్పించింది.

దీంతో అక్కడి సైన్స్‌ ల్యాబ్స్, ని­ష్ణా­తులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్‌స్పైర్‌’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటు­తున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడు­గు­రు విద్యార్థులు తమ సైన్స్‌ ప్రతిభతో ‘జపాన్‌ సకు­రా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపా­న్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మే­లో జపాన్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

10 నుంచి మూడో స్థానానికి..
నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపా­ధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభి­నందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదు­వు­కున్న విద్యార్థుల్లో 10 మంది గ­త సెప్టెంబరులో అమెరికా, యూఎన్‌ఓలో ప్రసంగించిన విషయం తె­­లి­చిం దే. ఇప్పుడు అదే స్థా­యి­లో ఇన్‌స్పైర్‌ విద్యా­రు­్థ­ల­ు జపాన్‌కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతు­న్నా­రు. 

జాతీయ పోటీలకు ఏటా 40 మంది..
‘ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ పర్‌స్యుట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీ­సె­ర్చ్‌’ (ఇన్‌స్పైర్‌) పేరుతో కేంద్ర సైన్స్‌ అండ్‌ ­టెక్నాలజీ విభాగం సైన్స్‌ పోటీలను నిర్వ­హిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యా­ర్థులు త­మ దైనందిన జీవితంలో చూసిన సమ­స్యలకు పరి­ష్కా­రాలను చూపుతూ నమూనాలను త­యా­రు­చేయా­లి. ఇందుకోసం ఇన్‌స్పైర్‌ వెబ్‌సైట్‌లో వి­వ­రా­లు నమోదు చేసుకుంటే.. ఆక­ర్ష­ణీ­యమైన అంశా­­లౖ­పె ప్రా­జెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నా­లు­గేళ్లుగా 40 వేల మందికి పైగా ప్ర­భు­త్వ పాఠశాల వి­ద్యార్థులు ప్రాజెక్టులు నమో­దు­చే­స్తు­న్నా­రు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వర­కు ఎంపి­క­వు­తుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రా­జె­క్టులు ఎంపికవుతున్నాయి. జా­తీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్ద­స్థా­యి­లో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది. 

ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్‌ రైట్స్‌..
గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్‌ వి­ద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అ­మ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్‌ ఫ్రెండ్లీ సో­లార్‌ కార్ట్‌ను రూపొందించింది. రూ.10 వేల ఖ­­ర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూ­ర­లు వారంరోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. 

అ­లా­గే.. 
► చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్‌ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా నిల్వచేసుకునే గార్లిక్‌ బ్యాగ్‌ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరి­యా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్‌ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది.

► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్‌ విద్యార్థి పి. చరణ్‌ తేజ బైక్‌పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్‌ సీట్‌ను రూపొందించాడు. 

ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గు­రు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్‌ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్‌ పర్యటనకు సిద్ధ­మ­వు­తు­న్నా­రని స్టేట్‌ సైన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్‌ స­దుపాయాలు, బోధనా పద్ధతులు మెరు­గుప­డ్డా­య­ని ఎస్సీ­ఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్ర­తా­ప్‌­రెడ్డి చె­ప్పా­రు. 2022–23 సంవత్సరపు ఇన్‌స్పైర్‌ పో­టీ­లు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమ­య్యా­యని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega