ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. చరిత్రలోనే తొలిసారి....

28 Jan, 2023 05:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: గ్రూపు–1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 8న ఇందుకు సంబంధించి రాతపరీక్షలు నిర్వహించారు. అయితే, ఏపీపీఎస్‌సీ చరిత్రలోనే రికార్డు వ్యవధిలో కేవలం 19 రోజుల్లో ఫలితాలు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం గ్రూపు–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,26,449 మంది దరఖాస్తు చేసు­కు­న్నారు. అందులో 1,06,473 మంది హాల్‌ టికె­ట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

వీరిలో 87,718 మంది ఈనెల 8న రాతపరీక్షకు హాజరయ్యారు. మె­రిట్‌ ఆధా­రంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొ­ప్పున మొత్తం 6,455 మందిని ఏపీపీఎస్‌సీ మె­యిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేస్తూ అందుకు సంబంధిం­చిన ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. మరోవైపు.. ఏప్రిల్‌ 23 నుంచి వారం రోజులపాటు జరిగే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీ­క్షల తుది కీ వివరాలు  ఠీఠీఠీ.pటఛి.్చp.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో చూసు­కోవచ్చని ఏపీపీఎస్‌సీ కార్యదర్శి జె. ప్రదీప్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

వేగంగా ఉద్యోగ నియామకాలకు సీఎం ఆదేశాలు
ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యానికి లోనుకాకుండా నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తికావాలని బోర్డు చైర్మన్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టమైన సూచనలు చేశారని ఏపీపీఎస్‌సీ బోర్డు సభ్యులు సలాం బాబు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీపీఎస్‌సీ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో రాతపరీక్షల ఫలితాలు ప్రకటించడం ఎప్పుడూ జరగలేదని ఆయన వివరించారు. 

 

మరిన్ని వార్తలు