శ్రీకాంత్‌కు మంత్రి అవంతి పరామర్శ

30 Aug, 2020 17:29 IST|Sakshi

సాక్షి, విశాఖ : శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆదివారం పరామర్శించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌, వైఎస్సార్‌ సీపీ నగర కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులపై దాడులను ప్రభుత్వం సహించదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రీకాంత్ కు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (చదవండి: తలబిరుసు.. లెక్కలేనితనం..)

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన లో దళితులు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ ‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అవంతి తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న నూతన్‌ నాయుడు భార్య మధు ప్రియతో పాటు మిగతా వారికి న్యాయస్థానం రెండువారాలు రిమాండ్‌ విధించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు