వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

15 Feb, 2023 15:19 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో.. బుధవారం పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులు అశ్వినిరెడ్డి, రామతేజేశ్వర్‌ రెడ్డిలను ఆశీర్వదించారు సీఎం జగన్‌.

నూతన వధూవరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకకు హాజరైన వారికి అభివాదం చేసిన సీఎం జగన్‌.. అక్కడికి వచ్చిన వాళ్లను అక్కున చేర్చుకుని ఆప్యాయంగా పలకరించారు కూడా.


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు